![]() |
![]() |
.webp)
నాగార్జున.. హుమ్... ఇది ఇన్ స్టాగ్రామ్ వాడుతున్న యూజర్స్ కి బాగా తెలిసిన ట్రెండింగ్. ట్రోల్స్ ని మీమ్స్ ని బాగా చూసేవాళ్ళకి ఇది అర్థమవుతుంది. అలాంటిది బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో తన అందంతో, ఆటతో ఆకట్టుకున్న శ్రీసత్య నోటివెంట ఈ మాటలు రావడం ఇప్పుడు నెట్టింట చర్చకి దారితీసింది.
యాంకర్ శివతో కలిసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ సత్య కొన్ని నమ్మలేని నిజాలు చెప్పుకొచ్చింది. మీ పోస్ట్ లకి వ్లాగ్స్ కి కొన్ని కామెంట్లు వస్తాయి కదా చూస్తారా అని శివ అడుగగా.. అవును కానీ నేను పట్టించుకోనని శ్రీసత్య అంది. లిప్స్ కి ట్రీట్ మెంట్ చేసుకున్నారా అని అడుగగా .. అవునని ఓ విషయాన్ని తెలియజేసింది. తన లిప్స్ చిన్నగా ఉన్నాయని సినిమాల్లో రిజెక్ట్ చేస్తున్నారట. దాంతో వాళ్లకి నచ్చే విధంగా.. ముంబై హీరోయిన్ మాదిరిగా లిప్స్‌కి సర్జరీ చేయించుకుని.. ఆఫర్ల కోసం ఇలా చేసుకున్నానని శ్రీసత్య అంది. ఇక చాలామంది లిప్స్ బాలేవని కామెంట్లు చేస్తున్నారంట.లిప్ పిల్లర్ చేయించా. నా డ్రీమ్ సినిమా. కాబట్టి.. దానికోసం నేను మార్చుకుంటున్నా. ముంబై వాళ్లని ఎందుకు తీసుకుంటున్నారు. వాళ్ల పెదాలు పెద్దగా ఉంటాయి. వాళ్ల షేప్ బాగుంటుంది.. డాల్ మాదిరిగా. నాకు నా లిప్స్ పెద్ద మైనస్. పై పెదవి చాలా చిన్నగా ఉంటుంది. అందుకే పెద్దగా అయ్యేట్టు సర్జరీ చేయించా. ఈ సర్జరీ చేయించాక.. ఇప్పుడు బాగున్నారని ఆఫర్లు ఇస్తున్నారు. నాకు నా లిప్స్ నచ్చాయి.. జనానికి నచ్చడం లేదు. మరో మూడు నెలలు నన్న భరించండి.. ఆ తర్వాత మాములు అయిపోతాయని తన అభిమానులకి చెప్పింది శ్రీసత్య.
ఇక సాకేత్, అర్జున్ కళ్యాణ్, మెహబూబ్ ల గురించి కామెంట్లు వస్తున్నాయి కదా ఏమంటావని అడుగగా.. అసలు నేను ఎవరితో ఉన్నా వారితో రిలేషన్ లో ఉందని అంటున్నారు. నాకు అసలు డ్యాన్స్ రాదు.. ఆ డ్యాన్స్ షో కోసం మెహబూబ్ తో కలిసి చేశాను. ఆ తర్వాత సాకేత్ తో కూడా అంతే. ఇక అర్జున్ కళ్యాణ్ కి ఫస్ట్ నుండి ఎండ్ కార్డు చూపించా కానీ అతని వైపు నుండి ఎండ్ అని రావడం లేదని శ్రీసత్య అంది. మరి పెళ్ళి చేసుకుంటావా అని అడుగగా. . లేదని అంది. ఇక శ్రీసత్య తన పర్సనల్ విషయాలని కూడా పంచుకుంది.
![]() |
![]() |